మహేష్ సినిమాకు మరో సీనియర్ హీరోయిన్ ను తీసుకొస్తున్న త్రివిక్రమ్.. ఈసారి ఎవరో..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇటీవల ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వడం తో పాటూ సీనియర్ హీరోయిన్ లను కూడా తన సినిమాల ద్వారా క్యారెక్టర్ పాత్రలతో పరిచయం చేస్తూ.. అలనాటి ప్రేక్షకులను కూడా అలరిస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోని మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న మరొక సినిమాలో ఒక కొత్త సీనియర్ హీరోయిన్ ను తీసుకురాబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు అనే విషయం కూడా ఒకసారి తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కారు వారి పాట సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత మహేష్ బాబు వెంటనే మరో సినిమా చేసి సూపర్ హిట్టు కొట్టాలని అభిమానులు కోరుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అంతేకాదు త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు పెడతామని చెప్పినా కొన్ని కారణాలవల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. కానీ ఇప్పటివరకు సినిమా షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఇక సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటూ అభిమానుల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే ఈ నెలలో సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్న త్రివిక్రమ్ తాజాగా సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి ని కీలకపాత్ర కోసం ఎంపిక చేశారని సమాచారం కూడా అందుతుంది.Venu Thottempudi | పూరీ జ‌గ‌న్నాథ్ నాతో 'దేశ‌ ముదురు' చేస్తాన‌ని వ‌చ్చారు : వేణు తొట్టెంపూడిఇక మరొకవైపు ఒక సీనియర్ హీరోయిన్ ను కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేశారట. అయితే ఈమె ఇప్పటివరకు ఎటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేయలేదు. అంతేకాదు మహేష్ బాబు సినిమాలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది అంటూ అంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి హీరోకి తల్లిగానా లేక ఇంకేదైనా ముఖ్య పాత్రలో కనిపిస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఆమె ఈ సినిమాలో ఉండడం వల్ల కచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణ ఉంటుంది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అన్న విషయం ఇంకా బయటకు రాకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news