త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిస్తే ఆ ఫాన్స్ ఎగిరి గంతేస్తారు..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ ఆదివారం రిలీజ్ అయి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. త్రివిక్రమ్ డైరెక్షన్ కి ఓవర్సీస్ లో సినిమా కి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావటం మాత్రమేగాక బన్నీ కెరీర్ లోనే ఓపెనింగ్స్ కూడా రికార్డు స్థాయిలో వచ్చినట్లు సమాచారం. ఇకపోతే సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వినబడుతున్నాయి.

 

ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రాగా తాజాగా మాత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం త్రివిక్రమ్ ఒక కత్తి లాంటి స్టోరీ రెడీ చేసినట్లు ప్యాన్ ఇండియా తరహాలో సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇదే నిజమైతే గనుక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతులు వేయడం గ్యారెంటీ అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది.

 

ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజ హేగ్దే   నటిస్తోంది. ప్రభాస్ తో త్రివిక్రమ్ సినిమా గురించి అధికారికంగా వార్తలు ఎక్కడ రాకపోయినా మాత్రం ఇండస్ట్రీలో గుసగుసలు గట్టిగానే వినబడుతున్నాయి.