కన్ఫ్యూజన్ లో త్రివిక్రమ్ .. కారణం పెద్దదే .. !

-

త్రివిక్రమ్ ‘అలవైకుంఠపురములో’ సినిమాతో అదిరిపోయే విజయాన్ని ఏడాది ప్రారంభంలోనే సాధించారు. సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన ‘అలవైకుంఠపురములో’ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో చేయాలని త్రివిక్రమ్ ఇటీవల డిసైడ్ అవ్వడం జరిగింది. అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది.

Will Trivikram give her second chance? - tollywood అయితే కరోనా వైరస్ రావడంతో ఇండస్ట్రీ లో అనీ సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఎన్టీఆర్ చేస్తున్న ‘RRR’ సినిమా షూటింగ్ బ్రేక్ పడటంతో త్రివిక్రమ్ ఇప్పుడూ ఎన్నడూ లేనంత కన్ఫ్యూజన్ లో పడిపోయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే రాజమౌళి సినిమా అయిన వెంటనే… ఎన్టీఆర్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ అనుకున్నారట. రాజమౌళి సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడటం, ఇంకా చాలా ఏడెనిమిది నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో త్రివిక్రమ్ తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పూర్తి మేటర్ లోకి వెళ్తే ఈ లోపు విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్టీఆర్ పుట్టినరోజు వస్తున్న సందర్భంలో ఇదే విషయంపై త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో డిస్కషన్ చేస్తున్నారట. మామూలుగా అయితే ఎన్టీఆర్ బర్త్ డే నాడు త్రివిక్రమ్ టైటిల్ ఎనౌన్స్ చేయాలని అనుకున్నారట. అయితే ప్రస్తుత పరిస్థితి బట్టి రాజమౌళి సినిమా ఏడెనిమిది నెలలు ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ చాలా కన్ఫ్యూజన్ లో పడ్డారట.

Read more RELATED
Recommended to you

Latest news