భార్గ‌వ్ కేసులో వ‌రుస ట్విస్టులు… లైవ్ లోకి మ‌రో యువ‌తి!

టిక్‌టాక్ భార్గ‌వ్ అంటే మొన్న‌టి వ‌ర‌కు టిక్‌టాక్ ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే తెలిసిన పేరు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. గ‌త రెండు రోజులుగా ఎక్క‌డ చూసిన ఇత‌ని గురించే విన‌ప‌డుతోంది. టిక్‌టాక్ ల ద్వారా పేరు తెచ్చుకుని.. ఆ త‌ర్వత ఫ‌న్ బ‌కెట్ లో కొన్ని వీడియోలు చేశాడు. బుల్లి తెర‌పై న‌టించాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేసినా.. అవ‌కాశాలు రాక తిరిగి వీడియోలే చేసుకుంటున్నాడు.

అయితే టిక్ టాక్ ద్వారా ప‌రిచ‌యం అయిన బాలిక‌ను మాయ‌మాట‌లు చెప్పి ప‌లుమార్లు లైంగిక దాడి చేసి, ఆమెను గర్భవతిని చేశాడ‌ని ఆమె త‌ల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో మ‌నోడి అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది. భార్గ‌వ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భార్గవ్ గురించి అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. త‌న‌కున్న పేరును వాడుకుని గతంలో చాలా మంది అమ్మాయిల‌కు ద‌గ్గ‌రైన భార్గవ్.. వారిని కూడా ఇలాగే శారీరకంగా వాడుకున్నాడ‌ని ఆరోపణలు వ‌స్తున్నాయి.

భార్గవ్ వలలో చాలామంది అమ్మాయిలు ఉన్నార‌ని మీడియాలో క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. భార్గవ్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. అందులో చాలా మంది అమ్మాయిల నెంబ‌ర్లు గుర్తించినట్లు స‌మాచారం. ఓ మై గాడ్ నిత్య మొన్న లైవ్ లోకి వ‌చ్చి.. త‌న‌కు భార్గ‌వ్ కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్ప‌డంతో ప్రేక్ష‌కుల్లో చాలా ర‌కాల అనుమానాలు మొద‌ల‌య్యాయి. గతంలో భార్గవ్ – మౌనికలు చేసిన అమ్మాయి – అబ్బాయి వీడియోలు గుర్తున్నాయి క‌దా. ఇప్పుడు ఆ అమ్మాయి లైవ్ లోకి వచ్చి క్లారిటీ ఇచ్చింది. త‌న‌కు కూడా ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చి చెప్పింది. అయితే వీరంతా భ‌య‌ప‌డి ఇలా వీడియోలు విడుద‌ల చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. చూడాలి మ‌రి ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులు వ‌స్తాయో.