సమస్త జీవరాశుల పుట్టుకకు కారణమైన భూమాత.. భూమి దినోత్సవం.. ప్రత్యేకత.. కొటేషన్లు.

-

భూమి దినోత్సవం.. ఎర్త డే. ప్రతీ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జరుపుకుంటారు. కాలుష్యాల వల్ల భూమిని పాడు చేయకుండా ఉంచేలా అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ రోజుని జరుపుకుంటున్నారు. 1970 నుండి భూమి దినోత్సవం జరపడం ప్రారంభించారు. ప్రస్తుతం 51వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం “భూమిని పునర్నిర్మిద్దాం” అనే నినాదంతో ఎర్త్ డే ని జరుపుకోవాలని నిర్ణయించారు. కాలుష్యాన్ని తగ్గించి మన భావి తరాలు జీవించడానికి అనుకూలంగా భూమిని మార్చడమే దీని ఉద్దేశ్యం.

సమస్త ప్రాణికోటికి బ్రతకడానికి కావాల్సిన అన్నింటినీ సమకూర్చింది భూమే. భూమి లాంటి వాతావరణం ఈ విశ్వంలో ఎక్కడుందో ఇప్పటికీ కనుక్కోలేకపోయాం. మరో భూమి ఉందో లేదో తెలియదు గానీ, ఉన్న భూమిని మాత్రం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చుట్టపు చూపుగా వచ్చిన మనకి భూమిని పాడు చేసే హక్కు లేదు. రేపటి తరం ఇక్కడే జీవించాలి. కాబట్టి, ఇప్పటి తరం భూమిని రక్షించాలి. భూమి దినోత్సవం రోజున మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని కొటేషన్లు..

ప్రతీ ఒక్కరి అవసరాలను తీర్చడానికి ప్రకృతి అన్నీ సమకూర్చింది. కానీ మనిషే అవసరాలని మించి కోరుకుంటున్నాడు -మహత్మాగాంధీ.

ప్రకృతిని పరీక్షగా గమనిస్తే ప్రతీదీ సులభంగా అర్థం అవుతుంది- ఆల్బర్ట్ ఐన్ స్టీన్.

ప్రపంచంలోనే ఉత్తమ వ్యక్తిగా ఎదగాలంటే కావాల్సిన రహస్యం నాకు తెలిసింది. ప్రశాంతమైన వాతావరణంలో పెరుగుతూ భూమితో పాటు పడుకుని అది ఇచ్చింది తింటే చాలదా?- వాల్ట్ వైట్ మేన్.

బావి ఎండిపోయినపుడే నీటి విలువ తెలుస్తుంది- బెంజమిన్న్ ఫ్రాంక్లిన్.

భూమి తనదైన సంగీతాన్ని వినిపిస్తుంది. వినాలన్న కోరిక ఉన్నవారి చెవులని మాత్రమే అది తాకుతుంది- విలియం షేక్స్ పియర్.

Read more RELATED
Recommended to you

Latest news