పాపం ‘సాహో’ సుజీత్ పరిస్థితి ఇలా అయిందేంటి…..??

-

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు యువ నటుడు శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుజీత్, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోవడం జరిగింది. యువి క్రియేషన్స్ పై చిన్న సినిమాగా తెరకెక్కిన ఆ మూవీలో కామెడీ, సాంగ్స్, ఆకట్టుకునే ట్విస్టులు ప్రేక్షకులను ఎంతో అలరించి మంచి సక్సెస్ అందించాయి. ఇకపోతే దాని తరువాత ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీసే ఛాన్స్ దక్కించుకున్న సుజీత్, అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఇటీవల ప్రభాస్ తో సాహోను తెరకెక్కించడం జరిగింది.

యువి క్రియేషన్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ నటించడం జరిగింది. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా చివరకు ఆ అంచనాలు అందుకోలేక చతికిలపడింది. భారీ రేంజ్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, అదిరిపోయే సెట్టింగ్స్, గ్రాండియర్ లుక్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ వంటివి సాహో సినిమాలో ఉన్నప్పటికీ, సినిమాలో మాత్రం ఆకట్టుకునే కథ, కథనాలు లేవని మెజారిటీ ప్రేక్షకులు పెదవి విరిచారు.

Updates On saaho Movie director sujeeth
Updates On saaho Movie director sujeeth

అయితే ఆ సినిమా కొట్టిన దెబ్బతో కొద్దిరోజుల పాటు బయటకు రాని సుజీత్, ఎట్టకేలకు ఇటీవల తన దగ్గరున్న ఒక స్టోరీని పలువురు హీరోలకు వినిపించాడని,అయితే ఎవరి నుండి కూడా అతనికి సరైన స్పందన రాకపోవడంతో, మళ్ళి తన తొలి సినిమా హీరో అయిన శర్వానంద్ దగ్గరకు ఆ కథను తీసుకెళ్లడం జరిగిందట. అయితే ఆ కథ విన్న శర్వా, తనకు బాగా నచ్చడంతో వెంటనే ఒప్పుకుని సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిందని అంటున్నారు. కాగా సాహో సమయంలో ఎంతో గొప్ప పేరును సంపాదించిన సుజీత్, రిలీజ్ తరువాత ఆ సినిమా పరాజయం పాలవడంతో చాలావరకు దర్శకుడిగా తన ప్రభావాన్ని కోల్పోయాడు అనడానికి ఈ ఉదంతమే కారణం అంటున్నారు సినీ విశ్లేషకులు…..!!

Read more RELATED
Recommended to you

Latest news