టీజర్ టాక్: తమ ప్రేమతో ప్రేక్షకుల గుండెల్లో ఉప్పెన సృష్టించేలా ఉన్నారు..

Join Our COmmunity

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన చిత్ర టీజర్ ఇంతకుముందే రిలీజైంది. క్రితిశెట్టి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆద్యంతం ఆసక్తిగా కనిపించింది. చాలా రోజుల తర్వాత మరో మారు సరికొత్త ప్రేమకథా చిత్రాన్ని చూడబోతున్నామని తెలుస్తుంది. టీజర్ మొదట్లో పంజా వైష్ణవ్ తేజ్ వాయిస్ లో, ఎవరికోసం పుట్టామో నా సిన్నప్పుడే తెలిసింది, కనిపించకుండా ప్రేమించేస్తున్నా అంటూ సాగే మాటలు, ఫైటింగ్ చేస్తున్న వైష్ణవ్ పాత్రని చూసిన క్రితి పాత్ర, వీడు ముసలోడు అవకూడదే అనడం చాలా కొత్తగా అనిపించింది.

ఐ లవ్ యూ అనే మాటని యూ లవ్ ఐ అని తిరిగేసి రాయడం, అలా ఎందుకని అంటే, నీకూ, నాకూ మధ్యలో ఎవ్వరూ ఉండకూడదని అందుకే ప్రేమని పక్కన పెట్టానని చెప్పడం అట్రాక్టింగ్ గా ఉంది. పూర్తి నిజమైన ప్రేమని చూపించబోతున్న సినిమాగా ఉప్పెన కనిపిస్తుంది. పవన్ తేజ్ హావాభావాలు, క్రితిశెట్టి అందం అన్నీ టీజర్ ని ఆసక్తికరంగా మార్చాయి. ఐతే సినిమా క్లైమాక్స్ మాత్రం విషాదభరితంగా ఉండనుందేమో అని టీజర్ చివర్లో చూస్తే అర్థం అవుతుంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీమూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news