Health Tips : మేకబోటి తినే అలవాటు లేదా… ఈ ప్రయోజనాలు కోల్పోయినట్టే?

-

Health Tips : సాధారణంగా మనం మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటాము అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ మాంసాహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. చాలామంది బోటీ తినడానికి ఇష్టపడగా మరికొందరు ఇష్టపడరు. అయితే చాలామందికి ఈ బోటీ తినే అలవాటు ఉండదు. ఇలా బోటీ కనక మీరు తినకపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మేక లేదా పొట్టేలు బోటీలో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బోటీలో మనకు ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ మరియు కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇది కోలిన్ యొక్క మంచి మూలం..ఇది మెదడు పనితీరును నిర్వహించడానికి ముఖ్యమైన పోషకంగా పరిగణించబడుతుంది.మేక ప్రేగులలో ఇనుము, మెగ్నీషియం, సెలీనియం, జింక్ మరియు కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E మరియు K వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇలా ఈ పోషకాలు బోటీలో అధికంగా ఉన్నాయి కనుక తరచూ బోటిని తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటినీ మనం పొంది మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో ఎంతగానో దోహదపడుతుంది. 1/2 కప్పు మేక ప్రేగులలో 1.57 mg విటమిన్ B12 ఉంటుంది. ఇందులో రోజువారీ తీసుకోవడంలో 65 శాతం ఉంటుంది. విటమిన్ B12 అధికంగా పొందటం వల్ల చర్మం, జుట్టు, కళ్ళు కాలేయం ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అందుకే నెలలో కనీసం రెండు లేదా మూడుసార్లు అయినా బోటీ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news