వకీల్ సాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా.?

రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమిక్స్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బోనికపూర్ దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

కాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అటు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు మరో సరికొత్త ప్రచారం ఊపందుకుంది. వేసవి సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్లో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేసవి వరకు ఆగాల్సి వచ్చేలా కనిపిస్తుంది.