వ‌కీల్ సాబ్‌కు త‌ప్ప‌ని క‌ష్టాలు.. మిగిలింది మూడు రోజులే

ఎన్నో అంచ‌నాల న‌డుమ విడుద‌లైన వ‌కీల్ సాబ్ అభిమానుల అంచాన‌ల‌కు త‌గ్గట్టు బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యంన‌మోదు చేసింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడేళ్ల విరామం త‌ర్వాత వ‌చ్చినా.. ఆయ‌న ప‌వ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించింది. కానీ సినిమా మొద‌ల‌యినప్ప‌టి నుంచి దీనికి క‌ష్టాలు త‌ప్ప‌ట్లేదు. ఇప్ప‌టికే ఈ సినిమా న‌టీన‌టుల‌కు, ప్రొడ్యూస‌ర్ల‌కు క‌రోనా సోకింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, దిల్ రాజు, నివేథా తామ‌స్ క‌రోనా బారిన ప‌డ్డారు. విజ‌యోత్స‌వాలు కూడా చేసుకోలేక పోయారు.


ఇదిలా ఉంటే కరోనా వైరస్ ప్ర‌క‌పంన‌లు సృష్టిస్తున్న నేప‌థ్యంలో బుధ‌వారం నుండి తెలంగాణలో థియేటర్లన్నింటినీ మూసివేసింది తెలంగాణ ఎగ్జిబ్యూటర్ల అసోసియేషన్ సంఘం. కానీ ‘వకీల్ సాబ్’ విష‌యంలో మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చింది. భారీ బ‌డ్జెట్ సినిమా కావ‌డ‌తో దీనికి కొన్ని ఆంక్ష‌ల‌తో మిన‌హాయింపు ఇచ్చారు. ఈ వారాంతం వరకు ‘వకీల్ సాబ్’థియేట‌ర్ల‌లో ఆడ‌నుంది. అయితే సోమవారం నుండి ఈ సినిమాను కూడా ఆపేస్తారు.
కొన్ని థియేట‌ర్ల‌లో ఈరోజు నుంచే ‘వకీల్ సాబ్’ సినిమాను నిలిపివేశారు. ‘వకీల్ సాబ్’ మూవీకి వారం రోజులుగా సరైన రెస్పాన్స్ కనిపించక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఉగాది త‌ర్వాత నుంచి థియేటర్లకు ప్రేక్ష‌కులు పెద్ద‌గా రావ‌ట్లేదు. హైద‌రాబాద్ సిటీ సెంటర్ లో ఉన్న మల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో కూడా 25మందికి మించి రావ‌ట్లేదు. దీంతో థియేట‌ర్ య‌జ‌మానులు క్లోజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ నిర్ణ‌యం వ‌కీల్ సాబ్‌కు పెద్ద న‌ష్ట‌మే చేస్తోంది. ఎందుకంటే ఈసినిమాకు 120కోట్ల దాకా షేర్ మార్కెట్ జ‌రిగింద‌ని స‌మాచారం. మ‌రి అంత మొత్తంలో ఇప్ప‌టికీ కూడా వ‌సూలు చేయ‌లేదు. ఇది ప‌వ‌న్ ఫ్యాన్స్ క పెద్ద దెబ్బే అని చెప్పాలి. మ‌రి ఓటీటీ బాట ప‌డుతుందో లేదో చూడాలి.