వకీల్ సాబ్ ఓటీటీలోకి వచ్చేది ఆరోజే..?

ఈ ఏడాది రిలీజైన అతి పెద్ద సినిమా అంటే వకీల్ సాబ్ ఒక్కటే అని చెప్పక తప్పదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత తెర మీద కనిపించడంతో అభిమానులందరూ ఉత్సాహంగా సినిమాకి పరుగెత్తారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వచ్చారు. పరిస్థితులు బాగుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి కలెక్షన్ల మోత మోగించేదే. కానీ, రిలీజైన వారానికి పరిస్థితి మొత్తం మారిపోయింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం అవడంతో కలెక్షన్లు తగ్గాయి.

థియేటర్ల మూసివేత లేకున్నా జనాలందరూ భయాందోళనలకి గురవడంతో సినిమాలు చూసేవాళ్ళు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి రిలీజ్ డేట్ నుండి 45రోజుల తర్వాత ఓటీటీలో రావాల్సిన వకీల్ సాబ్, అంతకంటే ముందుగానే వచ్చేస్తున్నాడని సమాచారం. కోవిడ్ కారణంగా మే 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం రానప్పటికీ అదే తేదీ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల భావన. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.