వామ్మో శర్వానంద్ పెళ్లి బడ్జెట్ అన్ని కోట్లా..?

-

ప్రముఖ టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్ వీడి వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు తాను తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల పెళ్లి వాయిదా వేసుకున్నారు అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి ఐదు నెలలకు పైగా కావస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంకా పెళ్లి ఊసు రాకపోవడంతో చాలామంది వీరిద్దరూ విడిపోయారు అని , ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు అంటూ రకరకాల రూమర్స్ సృష్టించారు. కానీ దీనిపై శర్వానంద్ టీమ్ స్పందించి త్వరలోనే శర్వానంద్ పెళ్లి తేదీని ప్రకటిస్తాము అప్పటివరకు ఇలాంటి రూమర్స్ ఆపండి అంటూ వారు కోరుకున్నారు.

అంతే కాదు శర్వానంద్ చేస్తున్న సినిమా షూటింగ్ లు కంప్లీట్ అయ్యాకే ఆయన ఫ్రీగా తన వివాహాన్ని చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అందుకే ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు అంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జూన్ 2, 3 తేదీలలో శర్వానంద్ ప్రముఖ సాఫ్ట్వేర్ ఉద్యోగి రక్షిత రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ మేరకు వీరిద్దరూ డెస్టినేషన్ వివాహానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజస్థాన్లోని లీలా ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే పెళ్లి తేదీ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారట కుటుంబ సభ్యులు.

ఇకపోతే తాజాగా శర్వానంద్ పెళ్లికి కేటాయించిన బడ్జెట్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి రాజస్థాన్లోని లీలా ప్యాలెస్ లో పెళ్లి అంటే రోజుకు 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిందే ఈ మేరకు రెండు రోజులపాటు జరిగే ఈ వివాహ వేడుకకు సుమారుగా రూ.8 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇక ఇవే కాకుండా పెళ్లి బట్టలు, నగలు , వచ్చిన బంధుమిత్రులకు బహుమతులు, విందు, వినోదం ,హల్దీ ఫంక్షన్ , మెహందీ, సంగీత్ వంటి ఫంక్షన్లకు సపరేటుగా డబ్బు వెచ్చించబోతున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే శర్వానంద్ పెళ్లి ఖర్చు సుమారుగా రూ.13 కోట్లకు అటు ఇటుగా అయ్యేటట్టు కనిపిస్తోంది. సరైన పార్ట్నర్ దొరికితే పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే కాబట్టి ఇలా డెస్టినేషన్ మ్యారేజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news