BIG BREAKING : అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ లేఖ

-

 

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బిగ్‌ షాక్‌ ఇచ్చింది సీబీఐ. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోనుంది సీబీఐ. ఈ తరుణంలోనే కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద హై టెన్షన్ నెలకొంది.

ఇక కాసేపటి క్రితమే.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కర్నూల్ ఎస్పీ కి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చింది సీబీఐ. అటు విశ్వభారతి ఆస్పత్రి వద్ద పోలీసులు మోహరించారు. మరికాసేపట్లో విశ్వభారతి ఆస్పత్రికి సీబీఐ అధికారులు రానున్నారు. ఎస్పీ కార్యాలయం దగ్గర పోలీస్ ఫోర్స్ కోసం వేచి చూస్తున్నారు సీబీఐ అధికారులు. అటు ఆస్పత్రి చుట్టూ ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు ఉన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ని అరెస్ట్‌ చేయకుండా అడ్డుకునేందుకు సిద్ధం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news