వామ్మో: విశ్వక్ సేన్ ఆస్తుల విలువ తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!!

-

విశ్వక్ సేన్.. ఇటీవల రెండు మూడు రోజుల నుంచి టీవీ9 ఛానల్ తో లైవ్ డిబేట్ జరిగిన తర్వాత ఈయన మరింత పాపులర్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఈయనకు సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ హీరో నాని లాంటి వాళ్లు కూడా విశ్వక్ సేన్ కు మద్దతు పలుకుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలాఉండగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక అభిమానితో నడిరోడ్డుపై చేసిన రచ్చ మాములిది కాదు.. అది ముగిసేలోపు టీవీ9 లైవ్ డిబేట్ ఇలా అన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫస్ట్ రివ్యూ హిట్ కొట్టినట్టే అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్ ఆస్తుల వివరాలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

వెళ్ళిపోమాకే అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్ సేన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఫలక్నామా దాస్ చిత్రంతో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన విశ్వక్ సేన్, హిట్ ది ఫస్ట్ కేస్ అనే సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా విక్రమ రుద్రరాజు గా చాలా బాగా అలరించాడు. పాగల్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈయన ప్రస్తుతం అశోక్ వనంలో అర్జున కళ్యాణం సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. 1995 హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ లో జన్మించిన విశ్వక్ సేన్ చిన్నతనం నుంచి క్రియేటివ్ ఫీల్డ్ లో పని చేయాలని అనుకున్నాడట. ఇకపోతే ఈయన తండ్రి కరాటే మాస్టర్.. తండ్రి సహకారంతోనే ఇంటర్ పూర్తయిన తర్వాత ముంబైలో థియేటర్ ఆర్ట్స్ పూర్తిచేశాడు విశ్వక్ సేన్.

డైరెక్టర్ అవుదాం అనుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన మొదట షూటింగ్ స్పాట్ లోకి వెళుతూ బంగారు బాబు సినిమాలో కూడా చిన్న పాత్ర చేశాడు. ఆ తర్వాత ఎట్టకేలకు వెళ్ళిపోమాకే సినిమాలో హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. కానీ తృప్తి లేకపోవడంతో తానే ఒక కథ రాసుకున్నాడు అదే ఫలక్నామా దాస్. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా హీరోగా అన్నీ తానే అయి తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో విశ్వక్ సేన్ పేరు మార్మోగిపోయింది. కానీ ఈ సినిమాకు విశ్వక్ తండ్రి పెట్టుబడిదారుడు గా వ్యవహరించారు. 9 షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు. విశ్వక్ కి తల్లిదండ్రులు పెట్టిన పేరు దినేష్ న్యూమరాలజీ ప్రకారం సినిమా అవకాశాలు రాకపోవడంతో విశ్వక్ సేన్ గా పేరు మార్చుకున్నాడు. ఇక ఈయన ఆస్తుల విషయానికి వస్తే తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తి సుమారుగా రూ.75 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. దిల్ శుఖ్ నగర్ లో ఖరీదైన బంగ్లా , రేంజ్ రోవర్ కారు కూడా ఉంది .

Read more RELATED
Recommended to you

Exit mobile version