బాబు గారూ.. మీరు ప‌ప్పు లోకేష్ ఫాద‌రే.. డౌట్‌లేదు: వ‌ర్మ

-

నిజాన్ని ఎన్న‌టికీ దాచ‌లేర‌ని, ఈ విష‌యం ఇంత వ‌య‌స్సు వ‌చ్చాక కూడా బాబుకు అర్థమ‌వ‌డం లేద‌ని అన్నారు. ఇది త‌న‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌ని వ‌ర్మ తెలిపారు.

ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ చిత్రం ఎట్ట‌కేల‌కు ఏపీలో విడుద‌ల కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే చిత్ర దర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ నిన్న విజ‌య‌వాడ‌లో సినిమా ప్రెస్ మీట్ పెట్టేందుకు పూనుకున్నారు. అయితే ప్రెస్ మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టులోనే వ‌ర్మ‌ను బంధించారు. దీంతో వ‌ర్మ చేసేది లేక వెనుదిరిగారు. అయితే త‌న‌ను ప్రెస్ మీట్ పెట్టుకోకుండా ఏపీ ప్ర‌భుత్వం పోలీసుల‌తో అడ్డుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఏపీలో ప్ర‌జాస్వామ్యం లేద‌ని విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే ట్విట్ట‌ర్‌లో వ‌ర్మ ఏక‌ధాటిగా ట్వీట్ల వ‌ర్షం కురిపించారు. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌పై వ‌ర్మ మ‌రోసారి ప‌ప్పు అని కామెంట్ చేశారు.

”40 ఏళ్ల రాజ‌కీయ అనుభవం ఉండి, 3 సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన బాబు.. ల‌క్ష్మీఎస్ ఎన్‌టీఆర్ అనే పేరుకు భ‌య‌ప‌డుతున్నార‌ని.. ఒక వేళ బాబు నిజంగా ఈ సినిమా చూసి భ‌య‌ప‌డితే.. అప్పుడు ఆయ‌న లోకేష్ ప‌ప్పు తండ్రే”న‌ని ట్వీట్ చేశారు. ఇక వ‌ర్మ ఆవేద‌న‌ను అర్థం చేసుకున్న వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా వ‌ర్మకు మ‌ద్ద‌తుగా అంత‌కు ముందు ట్వీట్ చేశారు.

”విజ‌య‌వాడ‌లో ప్రెస్ మీట్ పెట్ట‌లేని స్థితిలో ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఉంద‌ని, పోలీసుల‌ను చంద్ర‌బాబు బంట్రోతుల క‌న్నా హీనంగా వాడుకుంటున్నార‌ని, రామ్‌గోపాల్ వ‌ర్మ చేసిన త‌ప్పేమిటి ?” అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు. అందుకు వ‌ర్మ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నిజాన్ని ఎన్న‌టికీ దాచ‌లేర‌ని, ఈ విష‌యం ఇంత వ‌య‌స్సు వ‌చ్చాక కూడా బాబుకు అర్థమ‌వ‌డం లేద‌ని అన్నారు. ఇది త‌న‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌ని వ‌ర్మ తెలిపారు. ఇక ముందు ముందు వ‌ర్మ సీఎం చంద్ర‌బాబు, లోకేష్‌ల‌పై ఎలాంటి కామెంట్లు చేస్తారో వేచి చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version