బోల్డ్ క్యారెక్ట‌ర్లో వ‌రుణ్ సందేశ్.. అస‌లు సెట్ అవుతాడా..?

-

వ‌రుణ్ సందేశ్ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. క్లాస్ హీరోగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. త‌న మొద‌టి సినిమా హ్యాపీ డేస్ తోనే హిట్ కొట్టి వ‌రుస ఆఫ‌ర్లు అందుకున్నాడు. అయితే మ‌ధ్య‌లో చాలా కాలంగా ఆఫ‌ర్లు లేక ఖాళీగానే ఉంటున్నాడు ఈ హీరో. బిగ్ బాస్ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల బాట ప‌డుతున్నాడు.

 

అయితే ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ఇందువదన అనే మూవీతో వ‌స్తున్నాడు. ఇక ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ చాలా డిఫ‌రెంట్ అని చెప్పాలి. ఎందుకంటే గ‌తంలో వరుణ్ సందేశ్ ఇలాంటి బోల్డ్ క్యారెక్ట‌ర్ చేయ‌లేదు. ఇప్పుడు ఇందువ‌ద‌న మూవీ కోసం తొలిసారి అలాంటి క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నాడు.

ఈ పోస్ట‌ర్లో వ‌రుణ్ సందేశ్ తో పాటు హీరోయిన్ ఫ‌ర్నాజ్ శెట్టి డీప్ రొమాన్స్‌లో ఉన్న‌ట్టు పోస్ట‌ర్ ఉంది. అయితే సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. కాగా ల‌వ‌ర్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ‌రుణ్ సందేశ్‌ను అస‌లు బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో సెట్ అవుతాడా అనే అనుమానాలు క‌ల్గుతున్నాయి. ఆయ‌న అభిమానులు ఇప్పుడు దీనిపైనే చ‌ర్చించుకుంటున్నారు. అయితే మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news