తెలుగే రాదు.. జగన్ వెంట్రుక కూడా పీకలేవు : లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు. అనంతపూర్, కర్నూలు, కడప జిల్లాలో వర్గాలు ఉంటాయి..  పార్టీలు చూడరని…పాత రోజుల్లో కక్షల పెట్టుకుని, ఒకరినొకరు చంపుకునే ఫ్యాక్షనిజం ఈ మూడు జిల్లాలలో ఉంటుందన్నారు. లోకేష్.. నువ్వు ఒక బచ్చావి..ఒక చెంచావి నీకు అసలు తెలుగు మాట్లాడటం సరిగా రాదని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకో.. చంద్రబాబు నాయుడు కొడుకు అయ్యుండొచ్చు.. కాని మా జగన్ వెంట్రుక కూడా పీకలేవని లోకేష్ కు సవాల్ విసిరారు.

నువ్వు పోటీ చేసిన ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా మందలగిరి నియోజకవర్గం అని మాట్లాడతావని..అలాంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటావా ? అని ఫైర్ అయ్యారు. జాగ్రత్తగా ఉండండి.. నీవు నీ అబ్బ.. జిల్లాలలో కూడా తిరగలేరు.. తాట తీసేస్తామని హెచ్చరించారు. నువ్వు పిల్ల కుంకవి.. పిల్లోడివి.. నీ వయసెంత నువ్వెంత అని ఫైర్ అయ్యారు.  అడ్డదారిన మంత్రి పదవి సంపాదించుకున్నావని… నీ అబ్బా మంత్రి పదవి ఇస్తే పరిపాలించావని లోకేష్ పై మండిపడ్డారు.