ఏయన్నార్ గా సుమంత్.. వెంకటేష్ కామెంట్

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో సెప్టెంబర్ 20న ఏయన్నార్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో ఏయన్నార్ గా సుమంత్ లుక్ అదిరిపోయింది. అచ్చం ఏయన్నార్ కళ్ల ముందుకు వచ్చారన్న విధంగా తాతని పోలి ఉన్నాడు సుమంత్. ఇక నిన్న రిలీజైన ఏయన్నార్ ఫస్ట్ లుక్ చూసి విక్టరీ వెంకటేష్ కన్ ఫ్యూజ్ అయ్యాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ సినిమాలో ఏయన్నార్ లుక్ చూసి తాను కన్ ఫ్యూజ్ అయ్యానని.. అది సుమంతా..? నాగేశ్వర్ రావా..? పోల్చుకోలేకున్నానని అన్నాడు. లెజెండ్, ఏయన్నార్ గొప్ప వ్యక్తి ఆయన ఎప్పటికి మా హృదయాల్లో నిలిచి ఉంటారని కామెంట్ పెట్టాడు వెంకటేష్.

వెంకటేష్ అన్నాడని కాదు సుమంత్ ఏయన్నార్ లుక్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ సినిమా 2019 సంక్రాంతి రేసులో దిగుతుంది. ఎన్.టి.ఆర్ సిని, రాజకీయ జీవిత కథ అంతా సినిమాలో చూపిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, రానా, కళ్యాణ్ రాం నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news