వెంకటేష్ మరో మల్టీస్టారర్..?

-

గురు తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన వెంకటేష్ ప్రస్తుతం వరుసగా రెండు మల్టీస్టారర్ సినిమాలను చేస్తున్నాడు. అందులో ఒకటి వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్-2 కాగా.. మరోటి నాగ చైతన్యతో చేస్తున్న వెంకీ మామా. ఎఫ్-2 అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కుతుండగా వెంకీ మామా మాత్రం బాబి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో వెంకటేష్ తన ఫ్యాన్స్ ను అలరించడం ఖాయమని అంటున్నారు.

ఇక మరోపక్క మరో మల్టీస్టారర్ కు వెంకటేష్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. వెంకటేష్, దుల్కర్ సల్మాన్ లు కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట. నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో అటు వెంకటేష్, ఇటు దుల్కర్ సల్మాన్ ఇద్దరు సినిమా ఓకే చేశారని టాక్. బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారట. అయితే దీనికి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

మహానటి సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ అఖిల్ నటిస్తున్న 3వ సినిమాలో కేమియో రోల్ చేస్తాడని తెలుస్తుంది. మరి వెంకటేష్ తో చేసే మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం సోలో సినిమాల కన్నా ఇలా మల్టీస్టారర్ తీయడమే బెటర్ అనుకున్నాడో ఏమో వెంకటేష్ వరుసగా వాటినే చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news