వాడకమంటే నీదే దిల్ రాజు..!

-

నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. పెళ్లి ప్రాధాన్యత తెలిసేలా వస్తున్న ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కాబోతుంది. సినిమా ట్రైలర్ రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదగా రిలీజ్ చేయగా ఇప్పుడు సినిమాలో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ను వాడేస్తున్నాడు దిల్ రాజు.

శతమానం భవతి తర్వాత సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సన్నివేశాలు బాగుంటాయని తెలుస్తుంది. ఇక తన సినిమా ప్రమోషన్స్ లో స్టార్స్ ను వాడేస్తున్నాడు దిల్ రాజు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంగీత ప్రాధాన్యతగా రాబోతుందని ఆడియో చూసే చెప్పేయొచ్చు.

హీరోయిన్ గా వరుస సక్సెస్ లలో ఉన్న రాశి ఖన్నా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. ఈ వారం రిలీజ్ అయిన రెండు సినిమాలు హిట్ అవగా రాబోయే వారం సత్తా చాటేందుకు వస్తున్నాడు నితిన్.

Read more RELATED
Recommended to you

Latest news