మెగా వార‌సుడి స‌క్సెస్ మంత్రం.. వ‌రుణ్‌తేజ్ ప‌క్కా ప్లాన్‌

ఇండ‌స్ట్రీలోకి మెగా వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చి త‌న‌దైన శైలిలో సినిమాలు చేస్తూ స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు వ‌రుణ్ తేజ్‌. నాగ‌బాబు కొడుకుగా ప‌రిచ‌యం అయిన ఈ మెగా ప్రిన్స్ కెరీర్‌ను జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు. వ‌రుస‌గా స‌క్సెస్‌లు కొడుతున్నాడు. మెగా హీరోలెవ్వ‌రికీ ఇలా వ‌రుస‌గా స‌క్సెస్‌లు రాలేదు.

 

కానీ మ‌నోడికి మాత్రం ఆ ల‌క్ కాస్త ఎక్కువ‌గానే ఉన్న‌ట్టుంది. ఇప్పుడు ఎఫ్‌-3లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ కొట్టిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్‌పై కూడా భ‌రీ అంచనాలున్నాయి. దీంతో పాటు గ‌ని అనే స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మూవీలో చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు ఇప్పుడు క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. అయితే ఈ దొరికిన గ్యాప్‌లో మ‌నోడు ఓ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టేశాడు. ఛ‌లో, భీష్మ‌లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు తీసిన వెంకి కుడుముల‌తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ మూవీ ద‌స‌రాకు ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే మెగా ఫ్యాన్స్‌కు పండ‌గే.