‘వెంకీ మామ’ ట్విస్ట్ తెలిసిపోయింది……బొమ్మ అరుపులేనట…..!!

-

విక్టరీ వెంకటేష్ మరియు ఆయన మేనల్లుడు అక్కినేని నాగచైతన్య కలిసి తొలిసారి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు నిన్న రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్, అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా భారీగా పెంచాయి. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఖమ్మంలో ఎంతో వైభవంగా జరిగింది. ఇద్దరు మామ, అల్లుళ్ల మధ్య ప్రేమ, అనురాగం,

 

ఆప్యాయతలను గుర్తు చేస్తూ ఎమోషనల్ గా సాగె ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిని తాకుతుందని దర్శకుడు బాబీ చెప్పడం జరిగింది. వెంకటేష్ రైతుగా మరియు నాగచైతన్య సైనికుడిగా నటిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ మరియు రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక కీలకమైన ట్విస్ట్ ఉందని, దానితో సినిమా మొత్తం వేరే విధంగా మారుతుందని, అదే సినిమాకు పెద్ద హైలైట్ అని అంటున్నారు.

 

సినిమాలో ని సెకండ్ హాఫ్ లో తనను అమితంగా ప్రేమించే మామయ్యను మరియు హీరోయిన్ ని వదులుకుని అల్లుడైన నాగ చైతన్య హఠాత్తుగా ఆర్మీ లోకి వెళ్ళిపోతాడని, తనను అమితంగా ప్రేమించేవారిని వదిలి అతడు ఎందుకు సడన్ గా ఆర్మీ లోకి వెళ్లి సైనికుడిగా చేరాడు అనేది సినిమాలో కీలకమైన అంశం అని అంటున్నారు. కాగా ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం సినిమా డేట్ అయిన ఈనెల 13వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకు డి సురేష్ బాబు, టిజి విశ్వ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు……!!

Read more RELATED
Recommended to you

Latest news