బాలీవుడ్ పై మరోసారి వర్మ షాకింగ్ కామెంట్స్

అంశమేదైనా సరే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆర్ఆర్ఆర్, పుష్ప, కే జి ఎఫ్ 2 చిత్రాలు విడుదలైన నాటి నుంచి ఆయన బాలీవుడ్ పై వరుసగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది చిత్రాల విజయాలతో బాలీవుడ్ వాళ్ళకి పీడ కలలు తప్పవు అని, ఇకపై రీమిక్స్ కాకుండా మంచి కంటెంట్ ని నమ్ముకోవాలి అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన వర్మ, తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

థియేటర్లలో దక్షిణాది చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడం, ఉత్తరాది చిత్రాలు డీలా పడటం చూస్తుంటే.. త్వరలోనే బాలీవుడ్ కేవలం ఓటిటి కోసమే సినిమాలు తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయి అని వర్మ అన్నారు. జాతీయ భాష విషయంలో ఇటీవల సుదీప్- అజయ్దేవ్గన్ ల మధ్య జరిగిన ట్వీట్ల వార్, బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ బాబు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన వేళ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.