Satyajith: సినీ పరిశ్రమలో పెను విషాదం.. ప్రముఖ నటుడు సత్యజిత్ కన్నుమూత..

-

Satyajith: గత కొద్ది కాలంగా వరుసగా సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదాలు నెల‌కొంటున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ప్ర‌తి సినీ పరిశ్రమ పూర్తిగా దుఃఖంలో మునిగిపోయింది. తాజాగా మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ క‌న్నుమూశాడు. ఆదివారం తెల్లవారుజామున బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా సమాచారం.

గ‌త కొంత కాలంగా సత్యజిత్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. నిన్న రాత్రి ఆయ‌న‌కు ఆకస్మాత్తుగా గుండెపోటుతో వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చికిత్స తీసుకుంటునే.. సత్యజిత్ కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఆయ‌న అంత్యక్రియలు ఈ రోజు పూర్తిచేయనున్నారు. క‌న్న‌డ చిత్ర సీమ విషాదం ముగిసిపోయింది.

కన్నడంలో సత్యజిత్ ఆరు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్ సత్యజిత్. నటించడం ఆయన అభిరుచి. ఆ ఇష్టంతో 1986లో క‌న్న‌డ ఇండస్ట్రీలో కాలుపెట్టారు. అరుణరాగ ఆయ‌న తొలి సినిమా. ఆయ‌న ఎక్కువ‌గా విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన నటించిన ప్రసిద్ధ సినిమాలు: పుట్‌నంజ(1995), శివ మెచ్చిద కన్నప్ప(1988), చైత్రద ప్రేమాంజలి(1992), ఆప్తమిత్ర(2004).

Read more RELATED
Recommended to you

Latest news