విడుదలకు ముందే ఎన్నో వివాదాలకు గురైన ది కేరళ స్టోరీ సినిమా మే 5 న విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై స్పందించారు కాశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.
ది కేరళ స్టోరీ సినిమా విడుదలపై స్పందించారు వివేక్ అగ్నిహోత్రి. గత ఏడాది విడుదలైన కాశ్మీరీ ఫైల్స్ దేశం అంతా ఎంతగా ప్రకంపనాలు సృష్టించాయో తెలిసిందే. తాజాగా విడుదలైన ది కేరళ స్టోరీ సినిమా సైతం ఇదేవిధంగా వివాదాలకు గురైంది. తాజాగా అగ్నిహోత్రి ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూనే.. సుదీర్ఘమైన లేఖని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
“కేరళ స్టోరీ చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్. కానీ న్యూస్ కూడా. మీ జీవితాలు ఇక మునుపటిలా ఉండవు. మీపై ఓ వర్గం నుంచి తీవ్రమైన హేట్, వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మిమ్మల్ని హింసించే దిశగా మీ పై కామెంట్స్, విమర్శలు మొదలవుతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. నేను గొప్ప దర్శకులని, నటీనటుల్ని, విమర్శకులని చూస్తూ పెరిగాను. సమయంలో వాస్తవాలని వక్రీకరించి సినిమాపై విరుచుకుపడే వారిని కూడా చూశాను..” అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.
కశ్మీర్ పైల్స్ చిత్రంతో వివేక్ ఏ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారో అదే స్థాయిలో కొందరు ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్లో సైతం అగ్నిహోత్రికి వ్యతిరేకంగా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఏ విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడటానికి ఏమాత్రం వెనకాడటం లేదు ఈ డైరెక్టర్.