రష్మికతో రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మికతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇద్దరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు విజయ్ ఈ రూమర్‌పై స్పందించాడు. తన మనసులోని మాటను పంచుకున్నాడు. దీనికి కాఫీ విత్ కరణ్ షో కార్యక్రమం వేదికైంది.

‘విజయ్‌.. మీరు ప్రేమలో ఉన్నారా?’’ అన్న కరణ్‌ ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ.. ‘‘నేను పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నకు గట్టిగా సమాధానం చెబుతా. అప్పటివరకూ ఈ విషయంపై పెదవి విప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే, ఒక నటుడిగా ఇప్పుడు ఎంతోమంది నన్ను అభిమానిస్తున్నారు. వాళ్ల మనసులో నాకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. ఇంట్లో గోడలపై నా పోస్టర్లు, ఫోన్‌ వాల్‌పిక్‌పై నా ఫొటోలు పెట్టుకుని నన్ను ప్రేమిస్తున్నారు. ఇలాంటి సమయంలో నా ప్రేమ గురించి చెప్పి వాళ్ల మనోభావాలు దెబ్బతీయాలనుకోవడం లేదు’’ అని వివరించారు.

అనంతరం తాను రష్మికతో రిలేషన్‌లో ఉన్నట్లు వస్తోన్న వార్తలపై స్పందించారు. ‘‘నా కెరీర్‌ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశా. రష్మిక నాకు మంచి స్నేహితురాలు. తను నిజంగా డార్లింగ్‌. తనంటే నాకెంతో ఇష్టం. మేమిద్దరం కెరీర్‌, జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్లం. దానివల్ల మా మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడింది’’ అని అన్నారు.

‘ఖుషి’కోస్టార్‌ సమంతపై విజయ్‌ పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె భారతదేశంలోనే అందమైన మహిళ అని, అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. ఇక, అనన్యాపాండేతో తాను డేట్‌కు వెళ్లానని, కాకపోతే అది కేవలం ఫ్రెండ్లీ డేట్‌ మాత్రమేనని.. జాన్వీకపూర్‌ క్యూట్‌గా ఉంటుందని.. ఇప్పటికే పలుమార్లు ఆమెను బయట కలిశానని విజయ్‌ చెప్పుకొచ్చారు.