చరణ్ ను ఓడించిన విజయ్ దేవరకొండ

-

స్టార్ హీరోల సినిమాల రికార్డుల లెక్కలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. సినిమా మొదలైన నాటి నుండి రిలీజై రికార్డులు సృష్టించే దాకా ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. ఈమధ్య టి.ఆర్.పి రేటింగుల రికార్డులను ఇతర హీరోల సినిమాల రేటింగ్స్ తో పోల్చుతూ హడావిడి చేస్తున్నారు. ఇదిలాఉంటే మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ గా ఈమధ్య బాగా సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ తన రీసెంట్ మూవీతో ఏకంగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ ను ఓడించేశాడు.

అదెలా అంటే రాం చరణ్ నటించిన రంగస్థలం స్టార్ మాలో ప్రసారమైంది. ఆ సినిమాకు 19.5 టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది. ఇక విజయ్ నటించిన గీతా గోవిందం జీ తెలుగులో లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయ్యింది. ఆ సినిమాకు 20.7 టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది. టి.ఆర్.పి రేటింగులలో చరణ్ ను దాటేసి సరికొత్త రికార్డ్ సృష్టించాడు విజయ్ దేవరకొండ. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు స్మాల్ స్క్రీన్ పై కూడా గీతా గోవిందం సూపర్ హిట్ అనిపించుకుంది.

అయితే రంగస్థలం సినిమా థియేటర్ లో ఉన్నప్పుడే అమేజాన్ ప్రైం ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. అందుకే బుల్లితెర మీద ఆ సినిమా ఎక్కువమంది చూడలేదు. అయినా సరే 19.5 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది అంటే అది మెగా పవర్ స్టార్ స్టామినా అంటున్నారు. ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో వినయ విధేయ రామ సినిమా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news