కామ్రేడ్ బిజినెస్ అదిరింది..!

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. విజయ్ సరసన రష్మిక మందన్న నటించిన ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు మాత్రమే కాదు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అందుకే డియర్ కామ్రేడ్ బిజినెస్ అదిరిపోతుందట.

ముఖ్యంగా తెలుగులో డియర్ కామ్రేడ్ 40 కోట్ల దాకా బిజినెస్ చేస్తుందని తెలుస్తుంది. వరుస విజయాలతో విజయ్ క్రేజ్ అదిరిపోతుండగా గీతా గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక ఈ సినిమాలో నటించడం సినిమాకు ప్లస్ అయ్యింది. డియర్ కామ్రేడ్ సినిమా నైజాం, సీడెడ్ కలిపి 11 కోట్లకు కొనేశారట. ఆంధ్రాలో మరో 10 కోట్ల దాకా కోట్ చేశారట.

ఓవర్సీస్ లో కూడా విజయ్ క్రేజ్ దృష్ట్యా భారీగానే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి డియర్ కామ్రేడ్ 40 నుండి 50 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని తెలుస్తుంది. మే 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ ముందే ఈ హంగామా చేస్తే ఆఫ్టర్ రిలీజ్ ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.