నామినేషన్ వేసిన జగన్: ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే..!

ఆయన భార్య భారతి పేరిట 92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. తన కూతుర్లు హర్షిణిరెడ్డి పేరు మీద 6.45 కోట్లు, వర్షారెడ్డి పేరు మీద 4.5 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఆయన అఫిడవిట్‌లో తెలిపారు.

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.50 గంటలకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈసందర్భంగా జగన్ అఫిడవిట్ సమర్పించారు.

1994లో జగన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన మీద 31 కేసులు ఉన్నాయని అందులో తెలిపారు. ఆయన పేరిట 339.89 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు.. ఆయన భార్య భారతి పేరిట 92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. తన కూతుర్లు హర్షిణిరెడ్డి పేరు మీద 6.45 కోట్లు, వర్షారెడ్డి పేరు మీద 4.5 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఆయన అఫిడవిట్‌లో తెలిపారు.స్థిరాస్తుల విషయానికి వస్తే.. జగన్ పేరిట 35.30 కోట్లు, భారతి పేరు మీద 31.59 కోట్లు, తన కూతుర్ల పేరిట ఎటువంటి స్థిరాస్తులు లేనట్టు జగన్ తెలిపారు. తనకు 1.19 కోట్ల అప్పులు ఉన్నట్టు జగన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.