డియర్ కామ్రేడ్ టీజర్.. విజయ్ దేవరకొండ మార్క్..!

-

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా మొత్తం కాకినాడ బ్యాక్ డ్రాప్ తో వస్తుండగా విజయ్ ఇందులో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు.

ఇక సినిమా టీజర్ విషయానికొస్తే.. ఓ పక్క ఫైటు మరో పక్క లిప్ లాకు ఈ రెండిటి కాంబినేషన్ తో వెనుక ఓ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఇది డియర్ కామ్రేడ్ టీజర్.. రష్మిక నిన్న చెప్పినట్టుగా మళ్లీ మళ్లీ చెప్పేలా ఉంది ఈ టీజర్. మరోసారి విజయ్ బాక్సాఫీస్ పై తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మే లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version