తండ్రి అవుతున్న విజయ్ దేవరకొండ..!

-

లాస్ట్ ఇయర్ టాక్సీవాలా హిట్ తో మళ్లీ తన సత్తా చాటిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం భరత్ కమ్మ డైరక్షన్ లో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సింగరేణి కార్మికుడి పాత్రలో నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో అతను మిడిల్ ఏ రోల్ చేస్తున్నాడట.

సినిమాలో అతనికి పదేళ్ల కొడుకు కూడా ఉంటాడట. యువ హీరో విజయ్ ఈ పాత్రలో చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ ఎలా కనిపిస్తాడో చూడాలి. ఓ పక్క తన సినిమాలతో ట్రెండ్ సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ సడెన్ గా ఇలా మిడిల్ ఏజ్ రోల్ లో నటిస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో దర్శకుడిగా ప్రతిభ చాటిన క్రాంతి మాధవ్ సునీల్ తో చేసిన ఉంగరాల రాంబాబుతో డిజాస్టర్ అందుకున్నాడు. అయినా సరే తను చెప్పిన కథ నచ్చడంతో క్రాంతి మాధవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్ దేవరకొండ.

Read more RELATED
Recommended to you

Latest news