రెండో రోజే లాభాల బాట.. గీతా గోవిందం కలక్షన్స్ హవా..!

-

విజయ్ దేవరకొండ గీతా గోవిందం కలక్షన్స్ అదరగొడుతున్నాయి. మొదటి రోజు 9.71 కోట్ల వరల్డ్ వైడ్ కలక్షన్స్ సాధించిన గీతా గోవిందం రెండో రోజు తన దూకుడు చూపించాడు. పరశురాం డైరక్షన్న్ లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. తెలుగు రెండు రాష్ట్రాలతో పాటుగా యూఎస్ లో కూడా ఈ సినిమా కలక్షన్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నుండి ఇలాంటి సినిమా ఊహించని ఆడియెన్స్ కు గీతా గోవిందం ఓ సర్ ప్రైజ్ అయ్యింది. సినిమాపై ముందు నుండి అంచనాలు ఉండగా మొదటి రోజు వారెవా అనిపిస్తే రెండో రోజు ఏకంగా లాభాల బాటే పట్టింది. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కలక్షన్స్ దూకుడు చూస్తుంటే 50 కోట్ల మార్క్ దాటేలా కనిపిస్తుంది.

ఏరియాల వారిగా రెండు రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం : 3.10 కోట్లు

సీడెడ్ : 1.60 కోట్లు

ఉత్తరాంద్ర : 1.00 కోట్లు

ఈస్ట్ : 0.81 కోట్లు

వెస్ట్ : 0.69 కోట్లు

కృష్ణా : 0.79 కోట్లు

గుంటూరు : 0.91 కోట్లు

నెల్లూరు : 0.35 కోట్లు

ఏపి/ తెలంగాణా : 9.25 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news