దొరసాని అవుతున్న రాజశేఖర్ కూతురు

-

యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ ఈమధ్యనే పిఎస్వి గరుడవేగ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి రాగా తన తర్వాత సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక మరోపక్క తన కూతుళ్లను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు రాజశేఖర్. ఇప్పటికే రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు శివాని అడివి శేష్ తో 2 స్టేట్స్ సినిమా చేస్తుంది. గూఢచారి సినిమాతో సత్తా చాటిన అడివి శేష్ 2 స్టేట్స్ తో దమ్ము చూపించబోతున్నారు.

ఇక రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో శివాత్మిక నటిస్తుంది. ఈ సినిమాకు దొరసాని అని టైటిల్ అనుకుంటున్నారు. క్షణం సినిమాతో టాలెంట్ చూపించిన రవికాంత్ పాలెపు డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.

2 స్టేట్స్ తో పెద్దమ్మాయి.. దొరసానిగా చిన్నమ్మాయి ఇలా రెండు సినిమాలతో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు తెరంగేట్రం చేస్తున్నారు. మరి హీరోయిన్ గా ఇద్దరు క్రేజ్ తెచ్చుకుంటారా లేదా అన్నది సినిమాలు రిలీజ్ అయ్యాక కాని చెప్పగలం.

Read more RELATED
Recommended to you

Latest news