విజయ్‌ దేవరకొండతో పూరి నెక్ట్స్ క‌మిట్‌.. మ‌హేష్‌కు షాక్‌….

ఆరు వ‌రుస డిజాస్ట‌ర్ల త‌ర్వాత టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఎట్ట‌కేల‌కు ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో హిట్ కొట్టాడు. ఇస్మార్ట్ శంక‌ర్ ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన మొత్తానికి డ‌బుల్ అమౌంట్ వ‌సూలు చేసి రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. రామ్ హీరోగా నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకా ర‌న్ అవుతూనే ఉంది.

ఇక ఇస్మార్ట్ ప్ర‌మోష‌న్ల‌లో పూరి మ‌హేష్‌తో సినిమా చేస్తాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే మ‌హేష్ గ‌తంలో తాను ప్లాపుల్లో ఉన్న‌ప్పుడు ఛాన్స్ ఇవ్వ‌లేద‌ని పూరి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఈ క్ర‌మంలోనే పూరి – విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కమిట్ అవుతాడ‌న్న టాక్ సోష‌ల్ మీడియాలో వ‌చ్చింది. డియ‌ర్ కామ్రేడ్‌తో డీలా ప‌డ్డ విజ‌య్ – పూరి ప్రాజెక్టుపై క్లారిటీ వ‌చ్చేసింది.

దీనిపై క్లారిటీ ఇస్తూ ఛార్మి పూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఏ జోన‌ర్‌లో తెర‌కెక్కుతుంది ? ఎవ‌రెవ‌రు హీరోయిన్లుగా న‌టిస్తారు ? ఇత‌ర న‌టీన‌టుల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌టించింది. ఈ సినిమాను పూరి – ఛార్మీ క‌లిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.

మొత్తానికి మ‌హేష్‌పై సెటైర్లు వేసిన పూరి… మ‌హేష్ ఫ్యాన్స్ అంద‌రికి షాక్ ఇస్తూ విజ‌య్‌తో క‌మిట్ అయిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి. ఈ సినిమా ఈ యేడాదే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.