టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేయడం జరిగింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 వ తారీఖున రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో పాటు నలుగురు హీరోయిన్లు నటించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తవడంతో సినిమా రిలీజ్ అవ్వడానికి మిగతా బ్యాలెన్స్ కార్యక్రమాలు ఉండటంతో పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేశాడు విజయ్ దేవరకొండ.
అయితే సినిమాకి సంబంధించి పూరి జగన్నాథ్ తో షూటింగ్ చేసే సమయంలో పూరి వర్క్ స్పీడ్ చూసి విజయ్ దేవరకొండ ఉలిక్కిపడ్డరటా. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ…స్క్రిప్ట్ వరకు మరియు నటీనటుల చేత పూరి చేయించే పని విధానం విజయ్ దేవరకొండ ని బాగా ఆకట్టుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.
‘ఫైటర్’ అనే టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్‌గా కనిపించనున్నాడు.దీని కోసం ప్రత్యేకంగా థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ట్రెయినింగ్ కూడా తీసుకున్నాడు విజయ్. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్లుగా అనన్య పాండే నటిస్తోండగా, రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటిస్తోంది. తక్కువ టైంలోనే సినిమా కంప్లీట్ చేసి తొందరగా రిలీజ్ చేసే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు సమాచారం.