కాలు జారిన విజయ్ దేవరకొండ.. తప్పిన ప్రమాదం.. వీడియో

-

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో విజయ్ సౌత్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో విజయ్ కు ఉన్న క్రేజ్ చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఈ హీరో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. బాలివుడ్ హీరోయిన్ అనన్యా పాండే ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది.

కొద్ది రోజులుగా ఫైటర్ సినిమా షూటింగ్ ముంబై జరుగుతోంది. వీరిద్దరిపై పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో విజయ చిన్నపాటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సముద్రం ఒడ్డును నిర్మించిన జెట్టిపై విజయ్ నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా పడిపోబోయాడు.

దీంతో పక్కనే ఉన్న బాడిగార్డులు అతడిని పట్టుకోవడంతో ఎటువంటి గాయాలు తగలకుండా విజయ్ బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది….

 

View this post on Instagram

 

Slippery when wet, cautious Vijay ji you are precious to all of us✋

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Read more RELATED
Recommended to you

Latest news