ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయంగా బలహీనంగా ఉన్న ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే ఊహించని షాక్ ఇచ్చారు. ఆయనే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారడానికి సిద్దమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉన్న నేపధ్యంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటి అవ్వడానికి రెడీ అయ్యారు.
గత కొంత కాలంగా ఆయన క్వారీలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. దాదాపు 300 కోట్లకు పైగా ఆయనకు జరిమానా విధించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనితో అప్పటి నుంచి ఆయన పార్టీ మారడానికి సిద్దమవుతున్నారు. రాజకీయంగా బలంగా ఉన్న కుటుంబం ఆయనది. మంచి వర్గం కూడా ఉంది. అందుకే జగన్ కూడా ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి జగన్ ఆయన్ను తీసుకొచ్చే బాధ్యతను అప్పగించారు.
అప్పటి నుంచి ఆయనతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే గొట్టిపాటి మాత్రం పార్టీ మారడానికి ఆసక్తి చూపించలేదు. టీడీపీ ని వీడితే జరిమానా తగ్గుతుంది అని ఆయనకు కొందరు నేతలు సూచించారు. దీనితోనే ఆయన శనివారం మధ్యాహ్నం జగన్ తో భేటి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనితో శుక్రవారం సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.