టాక్సీవాలా రివ్యూ & రేటింగ్

-

వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో విజయ్ దేవరకొండకు గీతా గోవిందం సూపర్ హిట్ అవగా నోటా నిరాశపరచింది. ప్రస్తుతం టాక్సీవాలాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

మూడేళ్లలో పూర్తి చేయాల్సిన డిగ్రీని ఐదేళ్లలో పూర్తి చేసిన శివ (విజయ్ దేవరకొండ) హైదరాబాద్ వచ్చి జాబ్ లో జాయిన్ అవుతాడు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టి ఎప్పటిదో కారు కొంటాడు శివ. క్యాబ్ డ్రైవర్ గా కొత్త జీవితం ప్రారంభించిన అతైకి ఆ కారు బాగా కలిసి వస్తుంది. అయితే అనుకోకుండా ఆ కారు వల్ల అనూహ్య పరిణామాలు జరుగుతుంటాయి. కారు వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న శివ దానిలో దెయ్యం ఉందని గమనిస్తాడు. మరి ఆ కారులోకి దెయ్యం ఎలా వచ్చింది.. కారు కథ ఏంటి.. ఆ దెయ్యం ఎందుకు కారులో ఉంటుంది అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

హర్రర్ సినిమాలకు ఈమధ్య కామెడీ జోడించి హర్రర్ కామెడీ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆడియెన్స్ కు విసుగొచ్చేలా ఒకేరకమైన కథలతో ఈమధ్య సినిమాలు వచ్చాయి. అయితే విజయ్ దేవరకొండ టాక్సీవాలా సేమ్ హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చినా కొత్తగా ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ అనే కాన్సెప్ట్ ను యాడ్ చేసి మెప్పించాడు.

సస్పెన్స్ తో సినిమా నడిపిస్తూనే కామెడీతో మెప్పించాడు. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ టాలెంట్ తో సినిమా సరదాగా సాగేలా చూశాడు. మొదటి భాగం ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో చేశాడు. ఇక టాక్సీవాలా సినిమా నయనతార డోరా సినిమా కథకు దగ్గరగా ఉంటుంది.

సినిమా కథలో హీరో విజయ్ పాత్రకు ఆడియెన్స్ వెంటనే కనెక్ట్ అవుతారు. ఇక సినిమా స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టించదు. మొత్తానికి నోటా తర్వాత విజయ్ టాక్సీవాలా అన్ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నమని చెప్పొచ్చు.

ఎలా చేశారు :

విజయ్ సహజ నటన మెప్పించింది. సినిమాలో అతని పాత్ర చాలా జోవియల్ గా సాగుతుంది. ఇక థ్రిల్లర్ అంశాల్లో కూడా అతని నటన ఆకట్టుకుంటుంది. ప్రియాంకా జవల్కర్ పాత్ర చిన్నదే. అయినా అమ్మడు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. మాళవిక నాయర్ కూడా ప్రత్యేకమైన పాత్రలో మెప్పించింది. ఇక కొత్త కమెడియన్ విష్ణు అదరగొట్టాడు. మిగతా పాత్రదారులంతా పరిధి మేరకు నటించి మెప్పించారు

జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఓకే అనేలా ఉంటుంది. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. కథ, కథనాల్లో దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ప్రతిభ చాటాడు. డైలాగ్స్ కూడా చాలా నాచురల్ గా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. అయితే సెకండ్ హాఫ్ కాస్త స్లో అయ్యిందనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ దేవరకొండ

కామెడీ

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవడం

ప్రెడిక్టబుల్ స్టోరీ

బాటం లైన్ : టాక్సీవాలా.. థ్రిల్లింగ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 2.75/5

Read more RELATED
Recommended to you

Latest news