టాక్సీవాలా ట్రైలర్.. సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తున్న విజయ్ దేవరకొండ

-

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా టాక్సీవాలా. యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. సస్పెన్స్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది.

ఓ కారు చుట్టూ నడిచే కథగా టాక్సీవాలా సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. హీరో ముచ్చటపడి కొన్న కారు అతన్ని రిస్క్ లో పడేస్తుంది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఈ శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

విజయ్ దేవరకొండ సరసన ప్రియాంకా జవల్కర్ నటిస్తుంది. జాక్స్ బిజాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. గీతా గోవిందం సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన నోటా నిరాశపరచింది. మరి టాక్సీవాలా మళ్లీ అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news