నిధులు రాకముందే ‘జీవీఎల్ – కన్నా’ పంచేసుకున్నారా?

-

ఏపీలో భాజపా నేతలు ట్విట్టర్ వేదికగా తమ అతి తెలివిని మరోసారి బయటపెట్టుకున్నారు.  ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గిరిజ‌న వ‌ర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని కేంద్రం ఇటీవ‌ల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే…దీంతో అత్యుత్సాహంతో… జీవీఎల్ ట్విట్టర్ వేదికగా…వర్సిటీ నిర్మాణం కోసం కేంద్రం రూ 834 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే వర్సిటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు   క‌న్నా ల‌క్ష్మీ‌నారాయ‌ణ కేంద్రం రూ 420 కోట్లు మంజూరు చేసిన‌ట్లు ట్వీ‌ట్ చేయ‌డం వివాద‌స్ప‌ద‌మైంది. కేంద్ర నుంచి రాష్ట్రానికి నిధులు రాకముందే సగానికి సగం ఈ నేతలు పంచేసుకున్నారు అంటూ నెటిజన్లు కామేట్లతో విమర్శిస్తున్నారు. వీళ్లు ముదుర్లు రా నాయానా అంటూ కొందరూ… ఇలాంటి వారు ఉంటే రాష్ట్రం పరిస్థితి ఏంటీ? అంటూ వివిధ కామెంట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news