విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తా.. విజయ్ ఆసక్తికర కామెంట్స్

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ‘లైగర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ఫిల్మ్స్ ‘ఖుషీ’, ‘జనగణమన’పైన ఫోకస్ చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ను వీక్షించిన సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి తనకు ధోని బయోపిక్ లో నటించాలని ఉండేదని, కానీ, ఆ బయోపిక్ ను సుశాంత్ సింగ్ చేశాడని చెప్పాడు విజయ్ దేవరకొండ. విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉందని, తనకు అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చాడు రౌడీహీరో.

తను విరాట్ కోహ్లీ పాత్రకు చక్కగా సెట్ అవుతానని విజయ్ దేవరకొండ చెప్పాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ‘ఖుషి’ చిత్రంలో కథానాయికగా సమంత నటిస్తోంది. లవ్ స్టోరిగా వస్తున్న ఈ ఫిల్మ్ పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

virat-kohli
virat-kohli

ఇక పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ చేస్తు్న్న మరో సినిమా ‘జన గణ మన’. కాగా, ఇది పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను పూరీ జగన్నాథ్..మహేశ్ బాబుతో చేయాలనుకున్నారు. కానీ, విజయ్ దేవరకొండతో చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news