టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విజయ్‌కు కూడా సొంతంగా ఓ బ్రాండ్ ఉంది. అదేనండి ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ ఉంది కదా. అయితే రౌడీ బ్రాండ్ ఫ్యాన్స్‌కు విజయ్ బ్యాడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే ఆ బ్రాండ్‌కు ముగింపు పలకనున్నాడట. అయితే అంతగా బాధ పడిపోవనక్కర్లేదు. ఎందుకంటే మరో గుడ్ న్యూస్ కూడా వినిపించాడు ఈ రౌడీ హీరో.
2018లో రౌడీ బ్రాండ్‌తో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ఇప్పుడు ఆ బ్రాండ్‌కు ముగింపు పలుకుతూ.. ఈసారి అంతకుమించి అనిపించేలా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టనున్నాడట. దీపావళి సందర్భంగా ఆ సర్‌ప్రైజ్‌ని ప్రకటించనున్నట్లు విజయ్ తెలిపాడు. రౌడీవేర్‌కు సంబంధించి గతంలో జరిగిన వేడుకల దృశ్యాలను వీడియోలో చూపించాడు. విజయ్ ఈసారి ఎలాంటి బిజినెస్ చేస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికే విజయ్ చేయబోయే బ్రాండ్ ఏండో తెలిసిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. విజయ్ ఇటీవల ఓ అమ్మాయి చేతిలో ఓ అబ్బాయి చేయి ఉన్న ఫొటోను షేర్ చేసి న్యూ బిగినింగ్స్ అంటూ రాసుకొచ్చాడు కదా. అది చూసి అందరూ పెళ్లి వార్త చెప్పబోతున్నాడనుకున్నారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూసి అది పక్కా తన బిజినెస్ న్యూసేనని ఫిక్స్ అయ్యారు. అయితే ఆ ఫొటోలో ఓ చేతికి ఉన్న వాచ్ హైలైట్ అవ్వడంతో అది బిజినెస్ ప్రమోషన్ కోసమేనని ఇప్పుడు భావిస్తున్నారు.