విజ‌య్ దేవ‌రకొండ‌ – దిల్ రాజ్ మ‌ధ్య గొవ‌డ‌ ?

-

తెలంగాణ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప‌ట్టింద‌ల్లా బంగ‌రామే అవుతోంది. ఇటీవ‌లే డియ‌ర్ కామ్రేడ్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. డివైడ్ టాక్ వ‌చ్చినా..రివ్యూలు అనుకూలంగా లేక‌పోయినా విజ‌య్ ఇమేజ్ తో జ‌నాల్సి త‌న‌వైపు తిప్పుకో గ‌ల్గుతున్నాడు. ఒక్క‌సారైనా చూద్దాం! అన్న థాట్ తో థియేట‌ర్ కు వెళ్తున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద తుది ఫ‌లితం ఎలా విజ‌య్ కెరీర్ పై ఈసినిమా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌దు. ప్ర‌స్తుతం చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. అయితే ఈ న‌యా స్టార్ దిల్ రాజు ను లెక్క చేయ‌డం లేద‌న్న ఓ రూమ‌ర్ ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కొచ్చింది.

Vijay Deverakonda Avoiding Dil Raju?

ఇటీవ‌లే దిల్ రాజు దేవ‌ర‌కొండ‌తో సినిమా చేద్దామ‌ని అడిగాడుట‌. ఆ స‌య‌మ‌యంలో దేవ‌ర‌కొండ నోట చేద్దాం…చూద్దాం అనే అశ్ర‌ద్ద మాట‌లొచ్చాయి. దీంతో దిల్ రాజు దేవ‌ర‌కొండ ని కింద నుంచి పైకి వ‌ర‌కూ ఓ లుక్ వేసి మారు మాట్లాడకుంటా అక్క‌డ నుంచి వ‌చ్చేసాడుట‌. దిల్ రాజుతో సినిమా అంటే విజ‌య్ రేంజ్ స్టార్ మిస్ చేసుకోడు. పెద్ద ప్రొడ‌క్ష‌న్ కంపెనీ. పారితోషికం దండీగా ఇస్తాడు. స‌క్సెస్ అయితే అద‌నంగా బ‌హుమ‌తులుంటాయి. కానీ దేవ‌ర‌కొండ ఇవ‌న్నీ వ‌దుల‌కున్నాడు. దీంతో దిల్ రాజ్ తో ఎందుక‌లా మాట్లాడ‌డ‌ని ఆరా తీయ‌గా కొన్ని స్పెక్యులేష‌న్స్ వైర‌ల్ అవుతున్నాయి.

విజ‌య్ సినిమా ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ప్పుడు ఎన్నో సినిమా ఆఫీసులు చుట్టూ చిన్న చిన్న పాత్ర‌ల కోసం తిరిగాడు. అందులో దిల్ రాజు ఆపీస్ కూడా ఒక‌టిట‌. ఆ స‌మ‌యంలో దిల్ రాజు కొత్త‌గా వ‌చ్చిన వాళ్ల‌తో చేద్దాం..చూద్దాం అనే మాట‌లు అనేవాడుట‌. అలాంటి సంద‌ర్భంగా దేవ‌ర‌కొండ‌కి దిల్ రాజు రూపంలో ఎదురైందిట‌. అందుకే దిల్ రాజ్ త‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లేస‌రికి రివ‌ర్స్ పంచ్ వేసాడ‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news