యూర‌ప్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ హ‌గ్ చేసుకుంది ఎవ‌రిని?

ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` వీవ‌ర్స్‌ని పెంచుకోవ‌డం కోసం కొత్త మార్గాల‌ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా స్టార్ హీరోయిన్ స‌మంత తో టాక్ షోని మొద‌లుపెట్టింది. స‌మంత వ్యాఖ్యాత‌గా `ఆహా` నిర్వ‌హిస్తున్న టాక్ షో `సామ్ జామ్‌`. సామ్‌ తొలి సారి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ టాక్ షో శుక్ర‌వారం (ఈ నెల 13) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో తొలి గెస్ట్‌గా రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంట్రీ ఇస్తున్నారు.

ఇప్ప‌టికే విజ‌య్‌తో స‌మంత `మ‌హాన‌టి`లో క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మంచి ప‌రిచ‌యం వుంది కాబ‌ట్టి విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి చాలా వ‌ర‌కు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌టికి తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. స‌మంత విజ‌య్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది.

ఏం పెర్ఫ్యూమ్ వాడుతున్నార‌ని షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని అడ‌గ‌డంతో నా చెమ‌ట స్మెల్ అని చెప్పాడు. యూర‌ప్‌లో ఎవ‌రిని హ‌గ్ చేసుకున్నావ్ అంటే నాటీ అంటూ స‌మాధానం దాట‌వేశాడు.. ఇంత‌కీ విజ‌య్ దేవ‌ర‌కొండ యూర‌ప్‌లో హ‌గ్ చేసుకుంది ఎవ‌రిని అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో సామ్ `సామ్ జామ్‌`ని చూడాల్పిందే అంటూ ఎగ‌బ‌డుతున్నార‌ట రౌడీ ఫ్యాన్స్‌.