ఫ్లిప్ కార్ట్ కోసం మహానటి జంట

-

మహానటి జంట అనగానే కచ్చితంగా దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ అనుకోవడం కామనే.. వారితో పాటుగా మరో జంట ఆ సినిమాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వారే టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ బ్యూటీ సమంతలు. ఆంటోనీ, మధురవాణిల లవ్ స్టోరీ మహానటి సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్, సమంతలు కలిసి నటించే అవకాశం రాలేదు.

అక్కినేని కోడలిగా మారిన తర్వాత కమర్షియల్ సినిమాలను కాకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంది. అయితే విజయ్ తో మరోసారి బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రం స్క్రీన్ షేర్ చేసుకుంటుంది సమంత. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అయిన ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండింగ్ సేల్ గొప్పగా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఆఫర్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం వీరితో స్పెషల్ యాడ్స్ ప్లాన్ చేశారు.

ఇప్పటికే ఈ యాడ్స్ ఆన్ లైన్ లో వీక్షకులను అలరిస్తున్నాయి. విజయ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ చూసి వాణిజ్య ప్రకటనలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కె.ఎం.ఎల్ ఫ్యాషన్, సంగీతా మొబైల్స్, ఐటిసి లాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ తన సత్తా చాటుతున్నాడు. మరి విజయ్, సమంత చేసే ఈ ఫ్లిప్ కార్ట్ యాడ్స్ ఏమేరకు వారి బిజినెస్ పెంచుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version