విజయ్ దేవరకొండకు గాయాలు..!

-

టాలీవుడ్ క్రేజీ హీరో యూత్ స్టార్ గా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ షూటింగ్ లో గాయపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో విజయ్ ఎడమచేయికి గాయం అయ్యిందట. తనకు జరిగిన ఈ సంఘటన గురించి చెబుతూ గాయాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి.. ఎందుకంటే జీవితంలో ఏది సులువుగా రాదు.. అంటూ మెసేజ్ చేశాడు విజయ్.

ఈమధ్యనే టాక్సీవాలా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రెడ్ మూవీ భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తుంది. గీతా గోవిందం సినిమాతో ఈ జంటకు భారీ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే మరోసారి ఇద్దరు కలిసి ఈ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ మరోసారి గీతా గోవిందం మ్యాజిక్ రిపీట్ చేస్తుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version