సర్కార్ రిలీజ్ ఎన్ని దేశాల్లో తెలుసా..?

-

కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా క్రేజీ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కార్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న దీపావళి కానుకగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ట్రైలర్ తో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న విజయ్ సర్కార్ సినిమా దాదాపు 80 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారట. ఇక తమిళనాడు, కేరళలో రిలీజైన వారం వరకు రోజుకి 6 షోలతో రోజంతా షోలు నడిపిస్తున్నారట.

ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకుని మొదటి రోజు బాహుబలి రికార్డులను కొల్లగొట్టాలని చూస్తున్నారు మేకర్స్. బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్ ఈ రెండు రికార్డులలో ఒకదాన్నైనా సరే కొల్లగొట్టాలని చూస్తున్నాడు విజయ్. తెలుగులో కూడా దీపావళికి ఏ స్టార్ సినిమా రిలీజ్ లేదు కాబట్టి ఈసారి టాలీవుడ్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నాడట విజయ్. అందుకే ఇక్కడ ప్రమోషన్స్ కు విజయ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

ఓవర్సీస్ లో కూడా విజయ్ సర్కార్ భారీ రిలీజ్ సెట్ చేశారట. చూస్తుంటే విజయ్ సర్కార్ ఈసారి సరికొత్త సంచలనాలు సృష్టించేలా ఉందని చెప్పొచ్చు. మరి రిలీజ్ ముందు హడావిడి బాగున్నా ఆఫ్టర్ రిలీజ్ సర్కార్ సత్తా ఏంటో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news