సర్కార్ కు రిలీజ్ కష్టాలు..!

-

కోలీవుడ్ హీరో విజయ్, మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సర్కార్. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా జిల్లా, తుపాకి, కత్తి సినిమాల తర్వాత సర్కార్ తో కూడా మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు కష్టాలు తప్పేలా లేవనిపిస్తుంది.

అదెలా అంటే తమిళ రచయిత వరుణ్ రాజేంద్రన్ సర్కార్ సినిమా కథ తను రాసుకున్న కథకు కాపీ అంటూ హైకోర్ట్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. 2007 లో తాను రైటర్స్ అసోషియేషన్ లో తాను రిజిస్టర్ చేయించుకున్న సెంగోల్ కథను కాపీ చేసిన ఈ సినిమా తీశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు నష్టపరిహారం కింద 30 లక్షలు ఇస్తే కాని సినిమా రిలీజ్ కు ఒప్పుకోనని.. లేదంటే సినిమా రిలీజ్ కు అడ్డుపడతానని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కోర్ట్ కూడా ఈ నెల 30లోగా సర్కార్ దర్శక నిర్మాతల దగ్గర నుండి వివరణ కోరింది. మరి అతను కోరిన మొత్తం ఇచ్చి రిలీజ్ చేస్తారా లేక కోర్ట్ లో తమ వాదన వినిపించి గెలిచి సినిమా రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news