టాలీవుడ్‌పై విజ‌య్ సేతుప‌తి దృష్టి.. డైరెక్టుగా సినిమా చేసేందుకు ప్లాన్‌!

కొంద‌రు న‌టిస్తుంటే.. జీవిస్తున్న‌ట్టు అనిపిస్తుంది. సినిమా ఇండ‌స్ట్రీలో అలాంటి న‌టులు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. ఇప్ప‌టి త‌రంలో విజ‌య్ సేతుప‌తిని చూస్తుంటే నిజ‌మే అనిపిస్తుంది. ఆయ‌న ఏ పాత్ర చేసినా స‌రే దాన్ని పండించ‌డంలో ఆయ‌న నిమ‌గ్న‌మైపోతుంటారు. హీరోగా స్టార్ క్రేజ్ ఉన్న‌ప్ప‌టికీ.. విల‌న్ పాత్ర‌లు కూడా చేస్తూ మెప్పిస్తున్నాడు విజ‌య్ సేతుప‌తి.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ‌గా త‌మిళ సినిమాల్లోనే న‌టిస్తున్న ఈయ‌న‌.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీపై క‌న్నేసాడు. సైరా న‌ర‌సింహారెడ్డిలో డైరెక్టుగా క్యారెక్ట‌ర్ చేసిన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు.

ఇప్ప‌డు ఈ విల‌క్ష‌ణ న‌టుడు బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్ప‌డు విజ‌య్ హీరోగా తెలుగులో డైరెక్టు సినిమా చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ వారుప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మైత్రీ వారు తాజాగా విజయ్ సేతుపతి దగ్గరకు ఓ కథ తీసుకువెళ్లారట. మీడియం బడ్జెట్ తో ఈ సినిమా చేయడానికి మైత్రీ వారు ఓకే చెప్పేశారంట‌. త్వ‌రలోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.