బ్రేకింగ్: ఓటుకి నోటు కేసులో రేవంత్ కి గుడ్ న్యూస్…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఓటుకి నోటు వ్యవహారం సంచలనం అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కేసు విషయంలో బయటపడటం ఆయనకు క్లీన్ చిట్ రావడంతో టీడీపీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసుకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యే వరకు.. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీం ఆదేశం ఇచ్చింది.

తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సుప్రీం వాయిదా వేసింది. సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో రేవంత్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.